విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

సంగారెడ్డి/పటాన్ చెరు, జనవరి 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇంటికి ఇల్లాలే దేవత.. చదువుకున్న ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు దేశ అభివృద్ధిలో ముఖ్యులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అమీన్ పూర్ శాఖ అధ్యక్షుడు మంగళపర్తి వెంకటేశం అన్నారు. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని సంఘ సంస్కర్త, సావిత్రి బాయి జయంతి సందర్బముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీఎస్ జీఆర్ఈఏ) ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయులను సన్మానించారు. శుక్రవారం రాత్రి అమీన్ పూర్ లోని బృందావన్ టీచర్స్ కాలనీ లోని క్లబ్ హాల్ లో 10 మంది మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మంగళపర్తి వెంకటేశం మాట్లాడుతూ.. నిరాక్షరాస్యతను నిర్మూలించుటలో, భావిభారత పౌరులను తయారు చేయుటలో మహిళా ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర ఉందని తెలిపారు. ఈ కార్యక్రమములో గౌరవ అధ్యక్షుడు జే.ప్రభాకర్, కార్యదర్శి కే.నాగభూషణం, కోశాధికారి వై.రమేష్, పి.సురేందర్, బి.కృష్ణాగౌడ్, యస్. నాగేశ్వర్ రావు, పినాగభూషణం, కే.నాగరాజు, అంబదాస్, సుధాకర్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now