ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 4 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
పదవీ విరమణ సింగరేణి కార్మికుదు పరికిపళ్ళ సారయ్య లలిత దంపతులను సన్మానించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్మిక సంఘాల నాయకులు ప్రశంసించారు.
మణుగూరు ఏరియా ఓసీ-2 లో ఆపరేటర్ గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన ఏఐటీయూసీ నాయకులు సామాజిక కార్యకర్త పరికిపళ్ళ సారయ్య, లలిత దంపతులను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మంగళవారం నాడు సంతోష్ నగర్ లో సారయ్య నూతనంగా నిర్మించుకున్న స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ, ఏఐటియుసి ఐ ఎన్ టి యు సి, ఐ ఎఫ్ టి యు నాయకుల బంధుమిత్రుల సమక్షంలో శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా సింగరేణి కుటుంబం నుంచే వచ్చానని తన తండ్రి కూడా సింగరేణి కార్మికుడేనని సింగరేణి సంస్థలో పనిచేసిన అనుభూతి చాలా గొప్పదని ఆపరేటర్ గా సేవలందించిన సారయ్య సేవలను కొనియాడుతూ ఆయన విశ్రాంతి జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తో పాటు నూతన స్వగృహ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ సందర్భంగా సారయ్య బంధుమిత్రులను కార్మిక సంఘాల నాయకులను ఎమ్మెల్యే ఎంతో ఆత్మీయంగా పలకరించారు. సారయ్య నిర్మించుకున్న నూతన గృహాన్ని సందర్శించారు. ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి వై రాంగోపాల్ ఆధ్వర్యంలో నాయకులు సారయ్య లలిత దంపతులను శాలువా బహుమతులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, గట్టయ్య ,సింగరేణి వైద్యులు ఇన్నయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్,పూనెం శేఖర్, కూచిపూడి బాబు తిరుమలేష్, జీవరత్నం, సుబ్బారెడ్డి, గార్ల వెంకటేశ్వర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తరుణ్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు రామ నరసయ్య, మేకల ఈశ్వర్, ఎస్ కుమారస్వామి,శివయ్య, జీవి, ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నా సర్ పాషా, శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వహకులు బి జగన్మోహన్ రెడ్డి,కార్మిక నాయకులు సిహెచ్, వి రెడ్డి, ఓసి,2 పవర్ సెక్షన్ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు క్రాంతి కుమార్ పూజిత, విజయ జ్యోతి నవీన్ బాబు, డాక్టర్ దివ్యశ్రీ సహోద్యోగులు బంధుమిత్రులు పాల్గొన్నారు