పదవీ విరమణ మాజీ సైనిక , ఆపరేటర్ పీసీ మహాపాత్ర దంపతులను
*ఘనంగా సత్కరించిన సహోద్యోగులు*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 30 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్ – 2 లో ఈ పీ ఆపరేటర్ గా సేవలందించి శనివారం నాడు పదవీ విరమణ చేసిన కార్గిల్ పోరాటంలో పాల్గొన్న మాజీ సైనికుడు ప్రకాష్ చంద్ర మహాపాత్ర (పిసి మహాపాత్ర)సతీమణి సబితను రిలే-సి లో పనిచేస్తున్న తోటి ఆపరేటర్లు,మాజీ సైనిక్ ఆపరేటర్లు ఓసి- 2 నూతన సైట్ ఆఫీసులో శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు భారత సైనికుడిగా సరిహద్దుల్లో సేవలు అందించడంతో పాటు అనంతరం సింగరేణిలో ఈపీ ఆపరేటర్ గా విధులలో చేరి అటు అధికారులతో ఇటి తోటి కార్మికులతో కూడా మహాపాత్ర అంటే మౌనంగానే పనిలో మంచి పాత్ర పోషిస్తాడు అనే ఖ్యాతిని గడిచి ఉత్తమ ఉద్యోగిగా పదవీ విరమణ చేయటం అభినందనీయమని ఆయన సేవలు తోటి ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా మహాపాత్ర సేవలను కొనియాడారు అనంతరం ఆయన విశ్రాంత జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఆపరేటర్లు ఎస్ టి ఆర్ నాయుడు, బి భాస్కర్ రెడ్డి, ఆపరేటర్లు శనిగరపు కుమారస్వామి,మిద్దెపాక శ్రీనివాస్,పూజారి అర్జున్ రావు, కే రవిశంకర్,దరిసా రమేష్, అనిల్, రామ్ లాల్, మాజీ సైనిక మాజీ ఆపరేటర్ లీలాధర్ నాయక్ పలువురు ఆపరేటర్లు మాజీ సైనిక ఆపరేటర్లు పాల్గొన్నారు.