రిటైర్మెంట్ ప్రభుత్వ ఉద్యోగిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు
ఓకే ఇంట్లో 22 సంవత్సరాలుగా ఉంటూ అద్దె కిరాయి చెల్లిస్తూ అద్దె కుంటున్న రిటైర్మెంట్ ఉద్యోగి తుమ్మగళ్ళ బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడవేసి బలవంతంగా ఇల్లు కాళీ చేయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో ఉంటున్న బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయటపడేసి తనకు తెలియకుండానే తను ఉంటున్న ఇంటి సామాగ్రిని మొత్తాన్ని బయట పడవేసిన ఇంటి యజమాని పోగుల రవి. ఈవిషయం తెలుసుకున్న తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు వేముల బలరాం ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగి బాలమణిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాది హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు బలరాం,తుమ్మ గల్ల బాలమణి మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహించడం జరిగిందని అప్పటినుండి ఇంటి యజమాని అయిన వల్ల కట్టి నర్సయ్య ముంబైలో ఉంటున్నాడని అతని ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతుందని , అప్పటినుండి ప్రతినెల అద్దె కూడా కట్టడం జరిగిందని, కానీ గత మూడు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి బాలమణికి కొడుకును అవుతానని చెప్పి ఈ ఇల్లును కొనుగోలు చేయడం జరిగిందని, ఇట్టి విషయం పైన బిక్నూర్ పోలీస్ స్టేషన్లో సిఐ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని , నేనే ఈ ఇల్లును కొనుగోలు చేసుకుంటానని ఇల్లును రెండు మూడు లక్షల రూపాయలు పెట్టి మరమత్తులు చేసుకోవడం జరిగిందని మరమత్తులు చేసిన డబ్బులు ఇవ్వాలని బిక్కనుర్ పోలీస్ స్టేషన్లో కూడా సీఐ కి చెప్పడం జరిగిందని. నేను ఖర్చుపెట్టిన డబ్బులు ఇవ్వకుండానే తన ఇంటి సొంత సామాగ్రిని మొత్తన్ని ఇంటి బయట పాడేయడం జరిగిందని జిల్లా అధికారులు తనకు న్యాయం చేయగలరని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు రోజులుగా నా ఇంటి సామాగ్రి మొత్తం ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ భయభ్రాంతులను గురి చేస్తున్నారని దయచేసి జిల్లా అధికారులు న్యాయం చేయగలరని కోరారు.