రేవంత్, రాహుల్ మాటలకు పొంతన లేదు: హరీశ్ రావు
Aug 06, 2025,
రేవంత్, రాహుల్ మాటలకు పొంతన లేదు: హరీశ్ రావు
ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ ధర్నాపై BRS నేత హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్ చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నామని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే.. అదే సమయంలో రాహుల్ గాంధీ ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం అని ట్వీట్ చేశారు’ అని విమర్శించారు.