కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి

కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి

వరల్డ్ కప్ లో దూసుకుపోతున్న కోనేరు హంపి

సెమీస్ కు చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు

వరల్డ్ కప్ లో హంపి విజయం సాధించాలని ఆకాంక్షించిన రేవంత్ రెడ్డి

జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ లో తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి దూసుకుపోతోంది. వరల్డ్ కప్ సెమీస్ కు ఆమె చేరుకుంది. తద్వారా వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోనేరు హంపి చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్ పై 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆమెకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోనేరు హంపికి శుభాకాంక్షలు తెలియజేశారు. వరల్డ్ కప్ సెమీస్ కు చేరిన హంపికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని రేవంత్ అన్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వరల్డ్ కప్ లో ఆమె ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మరోవైపు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ ముఖ్ మధ్య జరిగిన క్వార్టర్స్ టైబ్రేకర్ కు వెళ్లింది. తొలి గేమ్ ను డ్రా చేసుకున్న వీరిద్దరూ… రెండో గేమ్ లోనూ పాయింట్స్ పంచుకున్నారు. ఈ క్రమంలో, వీరి టైబ్రేకర్ నేడు జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment