Site icon PRASHNA AYUDHAM

ఎన్నికల హామీలో రేవంత్ రెడ్డి ఎస్సీకులాలకు ఇచ్చిన హామీ కచ్చితంగా అమలు చేయాలి

IMG 20250624 200524

Oplus_131072

ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల జెడ్పిటిసి,ఎంపీటీసీ రిజర్వేషన్ జనరల్ లో కలపడం అన్యాయం అవమానం*

*నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జిల్లాకు రెండు ఎస్సీ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి*
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 24 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వంలో కోల్పోయిన స్థానిక ఎస్సీ రిజర్వేషన్ జెడ్పిటిసి, ఎంపీటీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం
కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల హామీలో టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల జెడ్పిటిసి,ఎంపీటీసీ స్థానిక రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినారు.ఎన్నికల హామీలను అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి 2025 స్థానిక ఎన్నికల్లో 2014 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆధారంగా ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని అన్నారు.
రాష్ట్రంలో పునర్విభజన చేపడితే ప్రతి ఏజెన్సీ జిల్లాకు రెండు ఎస్సీ అసెంబ్లీ స్థానాలుకేటాయించాలని కోరారు.వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడ్డ ఎస్సీ కులాలను గిరిజనులతో సమానంగా అభివృద్ధి చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో లక్షలాదిమంది ఎస్సీ కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా జనరల్ లో కలపడం అన్యాయం అవమానమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు
రాజ్యాంగపరమైన హక్కులకు దూరం చేసి అనాధలుగా చేయొద్దని ఆవేదన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేయాలని తెలియజేశారు.షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్, రాష్ట్ర నాయకులు గోదా రమేష్, జిల్లా నాయకులు కర్లపూడి సుందర్ పాల్,దూడపాక శివప్రసాద్,ఉండేటి దేవరాజ్, బల్లెం ప్రకాశం,ఎనగంటి శ్రీనివాస్, శేఖర్,నాగరత్నం,తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version