తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించడం లో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి

PDSU రాష్ట్ర అధ్యక్షులు

కాంపాటి పృథ్వీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యారంగానికి కనీసం ఓ ప్రత్యేక శాఖను నియమించకుండా జాప్యం చేస్తూ విద్యారంగాన్ని గాలికి వదిలేసి కేసిఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడని పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. గురువారం భద్రాచలం జూనియర్ కళాశాల విద్యార్థులు పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రశాంత్ అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందని ఎటువంటి పట్టింపులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది అని వారు కాంగ్రెస్ ప్రభుత్వం పై ద్వజమెత్తారు. ఒకపక్క గురుకుల విద్యాలయాల లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మరణిస్తుంటే మరోపక్క ప్రభుత్వ విద్యాసంస్థలన్నీంటిలో అర కొర సౌకర్యాలు, అధ్యాపకుల లేమి, మంచినీరు సమస్య, సరిపోనీ తరగతి గదులు, శిధిలావస్థలో బిల్డింగులు, అధ్య భవనాల్లో విద్యాసంస్థల నిర్వహణ లాంటి లోపాలతో ప్రభుత్వ విద్యా సంస్థలు కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వ చేయూత ఏమాత్రం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ విద్యాసంస్థల నిర్వహణకు ఉద్యోగుల జీతపత్యాలకు కూడా సరిపోని స్థితి ఉన్నదని ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కొత్త సీసాలో పాత సార చందంగా విద్యార్థులకు పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తోడై స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. అంతేకాకుండా సంవత్సరాల తరబడి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా వేల కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉంచి విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో కొంతమేరకైనా సమస్యలు పరిష్కరించబడాలి అంటే కొఠారి కమిషన్ సూచించిన మేరకు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని వారి డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నూతన ముసాయిదాను ప్రవేశపెట్టి వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులను వైస్ ఛాన్స్లర్ గా నియమించి విశ్వవిద్యాలయాలలో హిందుత్వ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కుట్రలో భాగంగానే నూతన ముసాయిదాను తీసుకొచ్చిందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించి చేతులు దులుపుకోవడం కాకుండా అడ్డుకోవాలని వారు సూచించారు. అమెరికాలో భారత విద్యార్థులపై ట్రంప్ దుశ్చర్యలను ఖండించాలని, భారత పౌరుల చేతులకు సంకెళ్లు వేసి అవమానపరుస్తుంటే దేశ ప్రధాని మోడీ ఎందుకు నోరు తెరవడం లేదని వారు ప్రశ్నించారు. భారత పౌరులు అవమానానికి గురికాకుండా గౌరవంగా దేశానికి తరలించే చర్యలు చేపట్టాలని మోడీని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని,విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ.విప్లవాభి వందనాలతో.
మునిగెల శివ ప్రశాంత్
పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి

Join WhatsApp

Join Now