రేవంత్ సర్కారు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నుంచి తప్పించుకునేందుకు స్కెచ్చే వేసింది.ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని, ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని.. యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపించి మరో ఆరు నెలలు ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా, ఉద్యోగాల భర్తీని పక్కనపెట్టేందుకు సర్కారు సిద్ధమైంది.ఆ నివేదిక వచ్చేదెన్నడు.. అమలుచేసేదెన్నడు.. ఉద్యోగాల భర్తీ అయ్యేదెన్నడు!