● సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు..
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 4 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
వరద బాధితులను ఆదుకోవడం పూర్తిగావిఫలమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముంపునకు గురైన ఖమ్మం పట్టణంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, ప్రతిపక్ష ఎమ్మెల్యే బృందంపై దాడులు చేయించడం ప్రజాస్వామ్యనికే సిగ్గుచేటని తాజామాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, తాజామాజీ జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ మంగళవారం తీవ్రంగా ఖండించారు. వరదలో చిక్కుకున్న ప్రజల కష్టసుఖాలను తెలుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లడం తప్పా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ తప్పిదాలు బయట పడతాయనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ గుండాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాడులు చేయించడం దుర్మార్గపు
చర్యలని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం ఈవిధమైన దాడులు ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేయిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండేవారా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంత పోకడలు మానుకోవాలని,మాజీ మంత్రి హరీష్ రావు ఆయన సహచర ఎమ్మెల్యేలపై దాడి చేసిన అల్లరిమూకలపై వెంటనే పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మాత్రం తర్వాత జరగబోయే పరిణామలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.