ఐరన్ లేడీ స్ఫూర్తితో తెలంగాణలో సీఎం రేవంత్ పాలన..నీలం మధు ముదిరాజ్..

తెలంగాణలో
Headlines :
  1. రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరాగాంధీ స్ఫూర్తి
  2. ఐరన్ లేడీని స్మరించుకుంటూ తెలంగాణలో సంక్షేమ పాలన
  3. పేదరిక నిర్మూలనలో ముందుకు రాష్ట్రం – సీఎం రేవంత్

సామాన్యులకు సంక్షేమాన్ని దగ్గరకు చేసిన దీరవనిత ఇందిరాగాంధీ..

గరీబి హటావ్ దేశ్ కో బచావో నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి..

ఐరన్ లేడీ స్ఫూర్తితో తెలంగాణలో సీఎం రేవంత్ పాలన..నీలం మధు ముదిరాజ్..

పేదరికం నిర్మలిస్తేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని గరీబీ హటావో దేశ్ కో బచావో నినాదంతో పేదలకు సంక్షేమాన్ని దగ్గరకు చేసిన గొప్ప వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు.

ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని చిట్కూల్ లోని ఆయన నివాసంలో దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదరికం నిర్మూలించే ప్రక్రియలో భాగంగా కూడు గూడు గుడ్డ లేని నిరుపేదలకు సాగు భూములను పంచడమే కాకుండా పక్కా గృహాలను నిర్మించి కోట్లాదిమంది భారతీయుల గుండెల్లో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆమె చేపట్టిన హరిత విప్లవంతో బీడు భూములు వ్యవసాయ భూములుగా మారి ప్రపంచానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా భారతదేశాన్ని నిలబెట్టారన్నారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నాడని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now