తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణ అమలు ఆలస్యానికి రేవంత్ రెడ్డే కారణం

ఎస్సీ
Headlines
  1. ఎస్సీ వర్గీకరణకు రేవంత్ రెడ్డి ఆటంకం
  2. మాదిగ జాతి మరో యుద్ధానికి సిద్దం
  3. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు ఆలస్యం
  4. రిజర్వేషన్ల కోసం మాదిగ ఉద్యమ నేతల నిరసన
  5. మాదిగల త్యాగాలను గౌరవించాలి – సామ్యెల్ మాదిగ
– మరో యుద్దానికి మాదిగ జాతిని సిద్దం చేస్తాం

 – కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ 

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే హక్కు అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని గత ఆగష్టు 1 న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు తెలంగాణ లో అమలు కాక పోవడానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డే కారణం అని గుర్తు చేస్తున్నాం అని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడంలో తెలంగాణను దేశంలో మొట్టమొదటి స్థానం లో నిలబెడితానని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నిండు శాసనసభలో ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అమలు చేయకుండా కమిటీ లు, కమీషన్ ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని తెలియజేస్తున్నాం అన్నారు.

మరోవైపు మాదిగలు ముప్పై ఏండ్లుగా ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసి వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో అమలు చేయకుండా 1,162 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి మాదిగ జాతికి తీరని ద్రోహం చేసిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎలాంటి మాటలు చెప్పకుండా ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు లోకి తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం గా హర్యానా ను నిలబెట్టిన ముఖ్య మంత్రి నయాబ్ సింగ్ సైనీ నిబద్ధత కలిగిన నాయకుడు అని ఆయన కు మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు. ఇకనైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, వర్గీకరణ అమలు అయ్యేంతవరకు ఉద్యోగ నియామకాలు నిలిపి వేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అన్నారు. ఇంకా కాలయాపన చేస్తూ రేవంత్ రెడ్డి మోసాల చరిత్ర తిరగరాయాలనుకుంటే మాదిగల ది త్యాగాల చరిత్ర అనే విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పీ ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈసమావేశానికి సీనియర్ నాయకులు బట్ట వెంకటరాములు మాదిగ,కత్తి పద్మారావు మాదిగ, సతిగారి లక్ష్మి మాదిగ, బాలరాజు మాదిగ, లావణ్య మాదిగ తదితరులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment