గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి 

IMG 20240811 WA0009

తెలంగాణ ఆర్థికాభివృద్ది, ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ, ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో గల ప్రఖ్యాత గూగుల్ (Google) సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో తెలంగాణ బృందం చర్చలు జరిపింది.

Join WhatsApp

Join Now