రేవంత్ రెడ్డి మీకు కోర్టుల మీద ఎందుకింత అపనమ్మకం. 

రేవంత్ రెడ్డి మీకు కోర్టుల మీద ఎందుకింత అపనమ్మకం. శనివారం ఆదివారం చూసి ఎందుకు ఇల్లు కూలకొడుతున్నారు.శనివారం ఆదివారం వచ్చినప్పుడే డోజర్లు బయటికి వస్తున్నాయి, కూలగొడుతున్నాయి. కోర్టులు అనాలోచితంగా ఉంటాయా ? మీకు జడ్జిల మీద, చట్టాల మీద నమ్మకం లేదా.. వారు మానవత్వంతో ఆలోచిస్తారు. హైకోర్టు మానవత్వంతో ఇక్కడ జరుగుతుందేందో చూడాలి. పేదల ఇళ్లను కులగోట్టి వారి ఆస్తులను ధ్వంసం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడ తప్పించుకోలేదు.వారి కాళ్ళ మీద వారు బ్రతుకుతున్న సామాన్యుల బ్రతుకుల్లో మట్టి కొట్టి, వారి జీవితాలు నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తావని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను.  

మీకు ఏం మానవత్వం ఉంది.

మీరు కులగోడుతున్నవారు సామాన్యులు. డబ్బు లేని వారు. కోర్టు మెట్లు ఎక్కలేని వారు కావచ్చు.. 

కానీ వారి ఏడుపు కన్నీళ్లు శాపనార్థాలు తప్పకుండా తాకకుండా పోవు. ఏమనుకుంటున్నావు నువ్వు. 

 

యుద్ధం వచ్చినప్పుడు వేరే దేశంవాళ్ళు వచ్చి నిర్దయగా చంపుతారు. 

కానీ ఇది యుద్ధభూమి కాదు. వీరేమీ కొట్లాటకు వచ్చేవారు కాదు. కానీ శత్రువు వ్యవహరించినట్లు ధ్వంసం చేసారు. మానవత్వం లేకుండా ప్రవర్తించారు. 

దీన్ని తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది. 

 

ఎంత దారుణం అంటే వీరు కేవలం షెడ్లు కూలగొట్టి పోలేదు. అందులో ఉన్న సామాన్లు కూడా డోజర్లతో ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్షపూరీతంగా, ద్వేషపూరితంగా ఉన్నారు అర్థమవుతుంది.

 

నీ తాత జాగీరు లెక్క, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, ఇంతకు ముందు ప్రభుత్వాలు లేనట్టుగా, ఏకలాజికల్ బ్యాలెన్స్ గురించి నువ్వే పట్టించుకున్నట్టుగా చేస్తున్నావు. 

 

నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాను. 

 

నేను స్థానిక ఎంపీ ని.. ఈరోజు అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని, తాతజాగీర్ లాగా ఏది పడితే అది చేస్తే చెల్లదుబిడ్డ. చరిత్రలో ఇలాంటివారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు.

ప్రజలు తలుచుకుంటే వారి కన్నీళ్లలో కొట్టుకుపోతారని హెచ్చరిస్తున్నాను. 

నష్టపోయిన వారికి అంచనాలు వేసి వారి బ్రతుకులను నిలబెట్టే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యను ఖండిస్తున్నాను.

 

– ఈటల రాజేందర్, ఎంపీ, మల్కాజిగిరి. 

 

 

కూకట్ పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. 

 

ఒకప్పుడు నల్లచెరువు ఎన్నో ఎకరాల పంటకు సాగునీరు అందించింది. 

అప్పటి రికార్డ్స్ ప్రకారం 19 ఎకరాలు ఉంది. 

మధ్యలో సర్వే చేసి 27 ఎకరాలు అని తేల్చి రికార్డుల్లో ఎక్కించారు. 

అయితే ఈ చెరువులో ఉన్న ప్రభుత్వ భూమి కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. 

మిగిలినవన్నీ బాజాప్తా పట్టాభూములు. అప్పట్లో నీళ్లు తగ్గి తేలినప్పుడు దున్నుకొనేవారు. 

పన్నులు కట్టలేక భూములు వదిలేసిన సందర్భాలు ఉండే. 

ఒకనాడు ఈ కూకట్పల్లిలో వెయ్యి రూపాయలకు ఎకరం అమ్ముకున్నవారున్నారు. 

కూకట్పల్లి అభివృద్ధి చెందిన తరువాత భూముల విలువ పెరిగింది.

ఈ చెరువు నింపడానికి పైనుండి ఎలాంటి వాగులు లేవు.. చుట్టుపక్కల పడ్డ వర్షంతోనే నిండుతుంది. 

ఈ చెరువు మత్తడిలో ప్రభుత్వమే కమ్యూనిటీ హాలు కట్టింది. నిబంధనలు ఉల్లంఘించింది. 

 

ఈ భూముల యజమానులు కొంతమందికి లీజుకు ఇచ్చుకున్నారు.. 

గ్రామాల్లో ఉపాదిలేని యువత సిటీకి వచ్చి బ్రతికేందుకు లీజుకు తీసుకున్నారు.

వీరిలో.. బెస్ట్ వింటెజ్ కాటరర్స్ పేరిట రమేష్ 50 లక్షల పెట్టుబడి పెట్టారు. 

ఫ్లెక్సీ ప్రింటర్స్ లక్షల రూపాయల పెట్టుబడి పెట్ట్టుకున్నారు. 

వీళ్లంతా హైదరాబాద్ కి బ్రతకడానికి వచ్చినవారు. కోట్ల రూపాయల యజమానులు కాదు. 

ఎక్కువ కిరాయి ఇవ్వలేక ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి. 

మహబూబ్ నగర్ నుండి వచ్చి బ్రతుకుతున్న రమేష్ తల్లి, కూలగొడుతుంటే కాళ్ళమీద పడింది. 

యుద్ధం వచ్చినప్పుడు వేరే దేశంవాళ్ళు వచ్చి నిర్దయగా చంపుతారు. 

కానీ ఇది యుద్ధభూమి కాదు. వీరేమీ కొట్లాటకు వచ్చేవారు కాదు. కానీ శత్రువు వ్యవహరించినట్లు ధ్వంసం చేసారు. మానవత్వం లేకుండా ప్రవర్తించారు. 

దీన్ని తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుంది. 

వారి సామాను తీసుకొని సమయం కూడా ఇవ్వకపోవడం దారుణం. 

నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే చెరువులలో ఉన్న పట్టా భూములను సేకరించాలి. 

ప్రాజెక్టులకు భూములను సేకరించినట్లు వీటిని కూడా తీసుకోవాలి. 

కానీ నీ తాతజాగీరు లెక్క, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, ఇంతకు ముందు ప్రభుత్వాలు లేనట్టుగా, ఏకలాజికల్ బ్యాలెన్స్ గురించి నువ్వే పట్టించుకున్నట్టుగా చేస్తున్నావు. 

చెరువులను కాపాడే మంచి అభిప్రాయం నిజంగానే నీకు ఉంటే హుస్సేన్ సాగర్ లో నీళ్లను తాగేలాగా తయారుచేయు. అన్ని చెరువులు మురికి కూపాలుగా మారిపోయాయి. వాటి చుట్టూ దుర్గంధ పూరిత బ్రతుకు బ్రతుకుతున్నారు. వాటిని ముందు బాగుచేయండి. 

 

మీరు కులగోడుతున్నవారు సామాన్యులు. డబ్బు లేని వారు. కోర్టు మెట్లు ఎక్కలేని వారు కావచ్చు.. 

కానీ వారి ఏడుపు కన్నీళ్లు శాపనార్థాలు తాకకుండా పోవు. ఏమనుకుంటున్నావు నువ్వు. 

 

ఉపాధి కల్పిస్తానని, పేదలకు అండగా ఉంటానని, వారి బ్రతుకుల్లో వెలుగు నింపుతానని అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తాను, పెన్షన్ పెంచుతా అని చెప్పారు అవి చేయలేదు కానీ వారి కాళ్ళ మీద వారు బ్రతుకుతున్న సామాన్యుల బ్రతుకుల్లో మట్టి కొట్టి ,వారి జీవితాలు నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తావని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను.  మీకు ఏం మానవత్వం ఉంది.  నువ్వు అనుకుంటున్నావు గొప్పగా చేస్తున్నానని.. కొద్దిమంది తెలియని వాళ్ళు.. సోషల్ మీడియా వాళ్లు.. చెరువులో అక్రమంగా ఉంటున్నారని అనుకుంటున్నాను. అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఉన్నారా అని బయట పెట్టు. దమ్ముంటే ఈ హైదరాబాదులో ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఇందులో ఎన్ని మాయమయ్యాయి.. ఈ మాయమాటనికి కారకులు ఎవరు తేల్చండి. బతకమ్మకుంట అంబర్పేటలో ఎవరు మాయం చేశారు. కృష్ణ కాంత్ పార్క్ ఎలా అయ్యింది. మాసబ్ ట్యాంక్ చెరువు క్రికెట్ గ్రౌండ్ ఎలా అయింది. చెరువులు పూడ్చి పార్కులు చేశారు.హుస్సేన్ సాగర్ లో ప్రసాద్ సినీమాక్స్, జలవిహార్ ,పారడైజ్ బిర్యాని సెంటర్ ఇవన్నీ FTLలోనే ఉన్నాయి. వాటి జోలికి పోయే సాహసం నీకు లేదు. నువ్వు చిన్న వాళ్ళ జోలికి మాత్రమే వస్తున్నావు.హైడ్రాకు ఇన్చార్జిగా ఉన్నాయన మాట్లాడుతారు.. శ్రీనివాస రెడ్డి షెడ్డును కొలగొట్టాను ఆయన ఒక రాజకీయ నాయకుడు అంటాడు. ఎలా కూలగొట్టావు నీకు రేపు కోర్టు తేలుస్తుంది. ఎంత దారుణం అంటే వీరు కేవలం షెడ్లు కూలగొట్టి పోలేదు. అందులో ఉన్న సామాన్లు కూడా డోజర్లతో ధ్వంసం చేస్తున్నారంటే ఎంత కక్ష పూరీతంగా, ద్వేషపూరితంగా ఉన్నారు అర్థమవుతుంది. పేదల ఆస్తులను ధ్వంసం చేసిన ప్రభుత్వం వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారిని ఆదుకోవాలి. వీరికి అండగా కోటానుకోట్ల మంది ప్రజలు ఉన్నారు. చెరువుల చుట్టూ ఉండేవాళ్లు పేదవారు. ఈ వాసనలో పేదవారు తప్ప ఎవరూ ఉండగలరు. మీకు కోర్టుల మీద ఎందుకింత అపనమ్మకం. ఆదివారం చూసి ఎందుకు కూలకొడుతున్నారు. కోర్టులు అనాలోచితంగా ఉంటాయా ? వారు మానవత్వంతో ఆలోచిస్తారు. హైకోర్టు మానవత్వంతో ఇక్కడ జరుగుతుందేందో చూడాలి.అన్యాయం జరిగితే ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కుతారు కానీ శనివారం ఆదివారం కోర్టు ఉండదని కూలగొడుతున్నారు. మీకు జడ్జిల మీద చట్టాల మీద నమ్మకం లేదా.. మరి దేని మీద నమ్మకం ఉంది.శనివారం ఆదివారం వచ్చినప్పుడే డోజర్లు బయటికి వస్తున్నాయి కూలగొడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే వీళ్ళు కోర్టుకు వెళ్లి ఎక్కడ స్టే తెచ్చుకుంటారు అనే కదా. కానీ కోర్టులు ఒట్టిగనే స్టేలు ఇస్తాయా?  కాపాడుదాం అని అంటున్నారు.. ఎవరు వద్దన్నారు ? చెరువులో ఉన్న భూములు ప్రైవేటు ఎంత ? ప్రభుత్వానిది ఎంత ? తేల్చండి.పేదల ఇళ్లను కులగోట్టి వారి ఆస్తులను ధ్వంసం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడ తప్పించుకోలేదు. ప్రజలకు, మేధావులకు, పర్యావర్తన వేత్తలుకు, హైడ్రాకు మద్దతుగా మాట్లాడే వారికి విజ్ఞప్తి చేస్తున్న. మీరు ఫీల్డ్ మీదికి రండి ఎంక్వయిరీ చేయండి.. వారి బ్రతుకులు ఏంది.. ఎప్పటినుంచి జీవిస్తున్నారు చూసి మాట్లాడండి. ఉత్తమ పని చేస్తున్నారని మద్దతు ఇస్తే రేపు రేపు మీ వంతు అవుతుంది.నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాను. నేను స్థానిక ఎంపీ ని.. ఈరోజు అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని, తాతజాగీర్ లాగా ఏది పడితే అది చేస్తే చెల్లదుబిడ్డ.చరిత్రలో ఇలాంటివారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు.ప్రజలు తలుచుకుంటే వారి కన్నీళ్లలో కొట్టుకుపోతారని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ నష్టపోయిన వారికి అంచనాలు వేసి వారి బ్రతుకులను నిలబెట్టే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యను ఖండిస్తున్నాను.

Join WhatsApp

Join Now