Site icon PRASHNA AYUDHAM

రైతు కష్టానికి కనీస న్యాయం చేయని రేవంత్ రెడ్డి సర్కార్

రైతు

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

Headline :
రైతుల కష్టానికి కనీసం న్యాయం చెయ్యని రేవంత్ సర్కార్

*కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు వద్ద?*
*15 రోజుల నుంచి గింజ వడ్లు కొనలేదు*
*మద్దతు ధర బోనస్ ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం*
*హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

*హుజురాబాద్ నవంబర్ 4( ప్రశ్న ఆయుధం)::-*

సోమవారం రోజున హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలంలో కేంద్రంలో గల మార్కెట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల పంటలు మిల్లులకు చేరక ముందే సంచులు పంపించి మిల్లులు ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లు చేసి ప్రతి గింజను కొనుగోలు చేసే చర్యలు చేపట్టారు కానీ, రేవంత్ సర్కార్ పంట రోడ్లపైకి వచ్చి నెలరోజులైనా ఇప్పటివరకు వడ్లు కొనడం లేదని పేర్కొన్నారు
*కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు వద్దు*
కోతులు పందులు పందికొక్కులు పశువులు పంటను నాశనం చేస్తుండగా రైతులు కల్లాల కాడా కాపలా కాస్తున్నారని ఎన్నికల సమయంలో రైతుల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ముఖ్యమంత్రిగా వడ్ల కొనుగోలుపై ఒక్కరోజైనా రివ్యూ చేపట్టారా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు వద్దని రైతులు పండించిన పంటలకు సకాలంలో మద్దతు ధర ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
*వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు*
రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద సరైన ఏర్పాటు చేయలేదని రైతులకు టార్పల్లిలను గన్ని సంచులను సుతిలి అందించాలని మక్కలను కొనుగోలు చేసే కేంద్రాలు లేవని పత్తికి కనీస మద్దతు ధర కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీసీఐ 7,521 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పత్తిని రైతులు కేవలం 5000 రూపాయలకు అమ్ముకుంటున్నారని పత్తికి మద్దతు ధర లేకపోవడం మక్కలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతులను తీవ్ర కష్టాల్లోకి నెట్టిందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు కేసీఆర్ రైతులకు నిజమైన సేవకుడు ఉన్నాడని కరోనా సమయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రైతుబందు అందించిన విషయాన్ని గుర్తుచేసి కేసీఆర్ రైతుల కోసం ఎమ్మెల్యేలు మంత్రుల జీతాలు ఆపారు కానీ, రైతుబందు ఆపలేదని 10 సంవత్సరాల పాలనలో 11 సార్లు రైతులకు రూ. 72,815 కోట్ల రైతుబందు అందించారని కౌశిక్ రెడ్డి రైతులకు గన్ని బ్యాగులు టార్పాలిన్ కవర్లు వంటి చిన్న సహాయం కూడా చేయడానికి రేవంత్ రెడ్డికి సరైన తెలివి లేదా? అని ప్రశ్నించారు.
రాజకీయ నేతలు రైతుల పట్ల తమ బాధ్యతను మరచిపోవడం సరికాదని, రైతుల పక్షాన నిలబడి తక్షణమే స్పందించాలని కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి వడ్ల కొనుగోలు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి, ప్రభుత్వాన్ని నిలదీస్తామని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మాజి జడ్పీటీసీలు లాండే కళ్యాణి లక్ష్మణ్ రావు నవీన్ సింగ్లెవిందో వైస్ చెర్మెన్ ఇంద్రసేనారెడ్డి కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, కమలాపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి కమలాపూర్ మాజీ ఎంపీటీసీలు అశోక్ మెండు రమేష్ మాట్ల వెంకటేశ్వర్లు కమలాపూర్ మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఇతర గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version