“రేవంత్ పాలన ప్రజా పాలన”…!!

రేవంత్ పాలన ప్రజా ప్రభుత్వ పాలన

* సర్వేలో 72% ప్రజల సంతృప్తి
* అంకన్నగారి నాగరాజ్ గౌడ్

కామారెడ్డి/బీబీపేట్,

తెలంగాణాలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోని ప్రజా సమస్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు పరిష్కరిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదారాబాద్ లో చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా ద్వారా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కూల్చేస్తున్నారన్నారు. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తూన్నారనీ, నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తూ హోటళ్లలో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచిందని అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి అధికారుల్లో గుబులు మొదలయిందన్నారు. తెలంగాణలోని 72 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని ‘పల్స్ ఆఫ్ పీపుల్’ అనే సంస్థ ‘పల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ’ పేరుతో నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని, ప్రజా ప్రభుత్వం పని తీరుకు ఈ సర్వే నిదర్శనమని ఆయన అన్నారు. ఈమధ్యే తెలంగాణ లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ‘పల్స్ ఆఫ్ పిపుల్” సంస్థ నిర్వహించిన సర్వేలో ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, శ్రామిక వర్గాలు, విద్యార్థులు, పురుషులు, మహిళలు పాల్గొన్నారని ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అంచనాలకు మించి సంతృప్తి ఇచ్చిందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పాలన పట్ల తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి,  ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

Join WhatsApp

Join Now