పట్టించుకొని పోలీసులు.. పత్తలేని రెవెన్యూ శాఖా..!

బాసరలో పేట్రేగిపోతున్న *ఇసుకాసురులు*

@ పట్టించుకొని పోలీసులు.. పత్తలేని రెవెన్యూ శాఖా

బాసరలో ఇసుకాసురులు పెట్రేగిపోతున్నారు. నదీ జలాలు ఇంకుడే ఆలస్యం తమ వీర ప్రతాపాన్ని చూపిస్తూ మండల ప్రాంతాలలో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ.. మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. అర్ధరాత్రిలు 100 స్పీడుతో దూసుకుపోతున్న లారీల స్పీడుకి మూగజీవాలు సైతం బలైన రోజులు ఉన్నాయి. మళ్లీ వానలు వస్తే ఇల్లు కట్టుకోవడం సులభతరం కాదని ఎంతైనా పెట్టి ఇసుకను కొనుగోలు చేసి తమ ఇళ్ల నిర్మాణానికి వాడుకుంటున్నారు ప్రజలు. అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని సంబంధిత అధికారులకు కొందరు ఫిర్యాదు చేయగా వారి పేరుతో సహా ఇసుక మాఫియా వ్యక్తులకు గతం లో తెలిసిపోయిందని.. తద్వారా తమకు హాని కలిగే ముప్పు ఉందని అందుకే ఫిర్యాదులు మాని ప్రజలు ఎంతైనా రేటు పెట్టి ఇసుకను ఖరీదు చేస్తున్నారు. కళ్ళ ముందే పదుల సంఖ్యలో లారీలు అక్రమంగా బాసరకు తరలివస్తున్న అధికారులు చోద్యం చూస్తూ జేబులు నింపుకుంటున్నారే తప్ప మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు..

*రాష్ట్రాలు దాటి…జిల్లాలు దాటి..*

బాసర గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఒకటి… కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలలోని మంజీరా….. గోదావరినదిలో భారీగా ఇసుక మేటలు ప్రతి ఏటా ఏర్పడుతూ ఉంటాయి. అయితే మహారాష్ట్రతో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి రాత్రిళ్ళు ఇసుక మాఫియా హద్దులు దాటుతూ ఓవర్ స్పీడ్ తో బాసరకు చేరుకుంటున్నాయి. మండల కేంద్రమే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన బిదిరెల్లి మీదుగా బైంసా పట్టణానికి అలాగే చుట్టుపక్కల గ్రామాలకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ కాసుల వర్షంలో ఇసుకాసురులు తెలియడుతున్న సంబంధిత అధికారులు షరా”మామూలే” అంటూ వదిలేస్తున్నారని పలువురు వాపోతున్నారు.

Join WhatsApp

Join Now