డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాళాలు వేసిన రెవిన్యూ అధికారులు
ప్రశ్న ఆయుధం 03 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు గురువారం రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు.గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్న ఆరుగురు లబ్ధిదారుల ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అతికించారు.దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.తామంతా ఇళ్లలోనే ఉంటున్నామని అధికారులకు ఎంత చెప్పినా వినిపించుకోకుండా తాళాలు వేసి జప్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇళ్లను ఇచ్చి లక్కోవడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు.తక్షణమే విచారణ చేపడుతామని సబ్ కలెక్టర్ కిరణ్మయి హామీ ఇచ్చారు.