జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పై మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ 

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పై మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్

 

కూకట్పల్లి

ప్రశ్న ఆయుధం

జూలై 08

 

కూకట్పల్లి నియోజకవర్గం,

గతవారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పై మంగళవారం గాంధీభవన్లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరిగింది. ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరైన ఈ మీటింగ్ పై పార్టీ నాయకులతో మహేష్ కుమార్ విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంటు, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. జై సంవిధాన్ సమావేశం విజయవంతం కావడంపై మహేష్ గౌడ్ రమేష్ తో పాటు స్థానిక నాయకులను అభినందించారు. భవిష్యత్తులోనూ పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ ధారా సింగ్ , శ్రీనివాస్ గుప్తా , యాదయ్య తదితరు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now