ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం

ప్రశ్న ఆయుధం, అక్టోబర్ 18: కూకట్‌పల్లి ప్రతినిధి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ ఇంచార్జీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం డివిజన్లోని ప్రతి బూతులో ఇంటింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కడప గడపగడపకు చేరేలా వివరించాలని కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసిన మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి రాబోయే ఎన్నికల్లో ఎర్రగడ్డ డివిజన్ లో మెజారిటీ ఓట్లు నమోదు అయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు బూతు లెవల్లో దొంగ ఓట్లు నమోదు చేసుకున్న వాటిని టిఆర్ఎస్ నేతలు పట్టుకొని ఎలక్షన్ కమిటీ కూడా ఫిర్యాదు చేశారని కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో కృషి చేసి టిఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా,కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, సంజీవ్,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now