కామారెడ్డిలో అభివృద్ధి పనుల సమీక్ష
శాఖల వారీగా ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలు పై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 31
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, శాసన సభ్యులు వెంకట రమణ రెడ్డి సమక్షంలో శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రగతి, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై చర్చించారు.
ఈ సమావేశంలో అటవీ, విద్యా, వైద్యం, మున్సిపాలిటీ, DRDO, ఎక్సైజ్, EEP&R తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి శాఖ పనితీరును పరిశీలిస్తూ, ప్రజలకు అందే సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.