విప్లవాత్మక నిర్ణయమే బీసి కులగణన

బీసి
Headlines:
“బీసీ కులగణన: కాంగ్రెస్ పార్టీ యొక్క విప్లవాత్మక నిర్ణయం”

” కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయమే బీసి కులగణన – సత్యం శ్రీరంగం.”

ప్రశ్న ఆయుధం నవంబర్ 02: కూకట్‌పల్లి ప్రతినిధి

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ కుల గణ పక్రియపై సూచనలు సలహాల సన్నాహక సమావేశం కొంపల్లి లోనీ కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, మేడ్చెల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, టీపీసీసీ జనరల్ సెక్రటరీ భూపతి రెడ్డి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ తెలంగాణాలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక, ఆర్ధిక, రాజకీయ కులగణన చేస్తామని గతంలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆమాటను నిలబెట్టడం ప్రతి కాంగ్రెస్ నేత బాధ్యతని అన్నారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం సంపద సమాన పంపిణీ కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. 1931లో మొదటి సారి సమగ్ర కుల గణన జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 2011లో కుల గణన జరిగిందని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కుల గణన జరుగుతుందని, బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , టిపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త తమ వంతు పాత్ర పోషించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Join WhatsApp

Join Now