Site icon PRASHNA AYUDHAM

జిఎన్ సాయిబాబాకు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విప్లవ నివాళులు.

సాయిబాబాకు
Headlines in Telugu:

ఇటీవల మృత్యువాతకు గురైన హక్కుల నేత ప్రపంచ మేధావి జిఎన్.సాయిబాబాకు బుధవారం కొత్తగూడెంలో బస్టాండ్ సెంటర్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర జి . న్.సాయిబాబా చిత్ర పటం వద్ద ఘనంగా నివాల్లర్పించారు. అనంతరం సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కల్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సంస్కరణ సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,కార్యదర్శివర్గ సభ్యులు ఎస్కే ఉమర్,పి డి ఎస్ యు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ* జిఎన్ సాయిబాబాను పాలకులే హత్య గావించారని అయినా ఆయన అనునిత్యం ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటాడని వారు అన్నారు. పూర్తి అంగ వైకల్యంతో కూడా జిఎన్. సాయిబాబా ఆదివాసి, దళిత, మైనారిటి మరియు పేద ప్రజల తరపున రాజీ లేని పోరాటం చేశారని వారు ఆయన్ను కొనియాడారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో దశాబ్ద కాలం పాటు నాగపూర్ జైలు అండ సెల్లో నిర్బంధించబడ్డ సాయిబాబా ఇటీవల నిర్ధోషిగా బయటకు వచ్చి తీవ్ర అనారోగ్యం సంభవించి పాలకుల చేతిలో హత్య గావించబడ్డాడని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. జి. న్ సాయిబాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ప్రతిన బూనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందు జి .న్. సాయిబాబా మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాల్లర్పించారు.కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్,వెంకటమ్మ,జక్కుల రాంబాబు,గూగులోత్ రామచంద్రు,కొండపనేని సత్యనారాయణ,వైయస్ రెడ్డి,వెంకట్రావు,ఆదినారాయణ,నాగరాజు,కుంజా భుద్ర,కారం వెంకటేశ్వర్లు,మల్లయ్య,కమల,సమ్మక్క,నాగమణి తదితరలు పాల్గొన్నారు.

Exit mobile version