రియాజ్ హత్యకు కారణమిదే..?* 

బాలాపూర్‌లో గ్యాంగ్ స్టర్ రియాజ్ హత్య తీవ్ర కలకలం రేపింది. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే రియాజ్‌‌ను టార్గెట్ చేశారు..? రియాజ్‌ను చంపింది ఎవరు..? అతన్ని టార్గెట్ చేసింది ఎవరనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేశారు. పది బృందాలుగా విడిపోయి కేసును చేధించారు. రియాజ్ హత్యకు కారణం పాత కక్షలని తేలింది. శత్రువు బిడ్డపై దాడి చేయడంతో హత్యకు పురిగొల్పిందని వివరించారు. సుఫారీ గ్యాంగ్ చేత పకడ్బందీగా హత్య చేయించారు.

 

ఏం జరిగిందంటే..?

 

గ్యాంగ్ స్టర్ రియాజ్‌కు రియాసత్ అనే సోదరుడు ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం రియాసత్- హమీద్ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. హమీద్‌కు వాటర్ ప్లాంట్ బిజినెస్, గుట్కా వ్యాపారం ఉంది. రియాసత్‌‌పై మీర్ పేట పోలీసు స్టేషన్‌లో హమీద్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు రియాసత్‌పై కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన సమయంలో రియాజ్ ముంబైలో ఉన్నాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత గొడవ గురించి సోదరుడికి రియాసత్ చెప్పాడు. తర్వాత అసలు కథ మొదలైంది. హమీద్‌ను చంపేస్తామని రియాజ్ ముఠా బెదిరించింది. హమీద్ కుమారుడిని టార్గెట్ చేసింది.

లైంగిక వేధింపులు..రియాసత్‌పై కేసు నమోదవడంతో రియాజ్ గ్యాంగ్ కోపంతో ఉంది. హమీద్‌కు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారిపై రియాజ్ ముఠా స్వలింగ సంపర్కానికి తెగబడింది. దాంతో బాలుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. కుమారుడి పరిస్థితి చూసి హమీద్, అతని భార్య అస్మా తట్టుకోలేక పోయారు. రియాజ్‌ను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నారు. నెలరోజుల క్రితం గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్‌ను కలిశారు. జరిగిన ఘటన గురించి చెప్పి, రియాజ్‌ను చంపేయాలని కోరారు. తర్వాత కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిపోయారు. రియాజ్ కోసం సలీమ్ అండ్ సుల్తాన్ గ్యాంగ్ నెలరోజుల నుంచి ఎదురు చూసింది. అదను చూసి హతమార్చింది.

 

బీహార్‌కు చెందిన గౌస్..సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్‌లో బీహార్‌కు చెందిన గౌస్ ఉన్నాడు. అతను తపంచ తీసుకొచ్చి, రియాజ్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. రియాజ్‌పై కాల్పులు జరిపి, సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ పారిపోయింది. రియాజ్ హత్య గురించి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. ఎంక్వైరీలో కీలక విషయాలు తెలిశాయి. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హమీద్ కుమారుడిపై స్వలింగ సంపర్కం చేయడంతో రియాజ్ హత్యకు దారితీసిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ పై గతంలో కూడా కేసుల్లో ఉన్నాయని వెల్లడించారు..

Join WhatsApp

Join Now