వరి పంట నష్టం – రైతుకు ఎకరాకు ₹40 వేల నష్టపరిహారం ఇవ్వాలి : టీడీపీ డిమాండ్

వరి పంట నష్టం – రైతుకు ఎకరాకు ₹40 వేల నష్టపరిహారం ఇవ్వాలి : టీడీపీ డిమాండ్

కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం):

లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు తెగిపోవడంతో వరి పంటలు పూర్తిగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు ఎకరాకు ₹40,000 చొప్పున నష్టపరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మండల తహసీల్దార్‌కు టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భీంరావ్, ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ శర్మ, ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ రెడ్డి, కే. కృష్ణ, డి. సాయిలు, ఎల్. పోచయ్య, వి. తిరుపతి, నాణ్య నాయక్, జెగ్య నాయక్, టీ. కిషన్, బి. రాజు, కె. రమేష్, బి. సాయిలు, వీ. నర్సింలు, ఎం. కాశీరాం, ఎస్. రకృష్ణతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment