Site icon PRASHNA AYUDHAM

విద్యా హక్కు చట్టం 2009.మన పిల్లల హక్కు..

IMG 20241021 WA0004

విద్యా హక్కు చట్టం 2009.మన పిల్లల హక్కు..

ఆంధ్రప్రదేశ్ డేస్క్ మంగళగిరి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:

రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో 25,125 మంది పిల్లలకు విద్యా హక్కు చట్టం
(ఆర్.టి.ఈ.) 2009 కింద ఉచిత విద్య అందించబడుతుంది.
ఆర్.టి.ఈ. చట్టంలోని సెక్షన్ 12(సి) ప్రకారం, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు బలహీన వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఫస్ట్ క్లాస్ లేదా ప్రీ-స్కూల్ మొత్తం బలంలో కనీసం నాలుగింట ఒక వంతు ఉచిత విద్యను అందించాలి.
చట్టాన్ని ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా పాఠశాల అడ్మిషన్ నిరాకరించడం, ఏరకమైన ఫీజు వసూలు చేయడం ఒత్తిడి చేయడం లేదా
ఆర్.టి.ఈ. చట్టం అమలుకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉన్న తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్
CH76+2H8, NH 16 సర్వీస్ Rd, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ 522503
మెయిల్ ఐడి: apscpcr2018@gmail ద్వారా ఫిర్యాదు చేయాలి..
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్5వ అంతస్తు, చందర్‌లోక్ బిల్డింగ్, 36 జనపథ్, న్యూ ఢిల్లీ-110001.ఫ్యాక్స్ : 011-23724026
ఫిర్యాదు కోసం: www.ebaalnidan.nic.in ద్వారా ఫిర్యాదు చేయాలి..

Exit mobile version