విద్య హక్కు చట్టం 2009 కఠినంగా అమలు చేయాలి – విద్యార్థి తల్లిదండ్రుల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ డెస్క్ ప్రశ్న ఆయుధం నవంబర్ 02:
ప్రభుత్వం వెంటనే విద్య హక్కు చట్టం 2009 రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలి. “వేలాది మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తు కు రక్షణ కల్పించండి. ఇది ప్రభుత్వం బాధ్యత. ఫీజుల వేధింపులపై ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలకు ఉత్తర్వులు జారీ చేయాలి..”ప్రభుత్వం వెంటనే స్పందించాలి విద్యాహక్కు చట్టం 2009 క్రింద ఉచిత విద్య అడ్మిషన్ పొందిన విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను ఫీజులు చెల్లించాలని వేధిస్తున్న రాష్ట్రంలోని భాష్యం ఇతర ప్రైవేటు పాఠశాలల దౌర్జన్యం నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి… “దేశ అత్యున్నత న్యాయస్థానం…సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు… రాష్ట్ర హైకోర్టు…. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తున్న”… ఫీజులు చెల్లించాలని వేధింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న…ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ప్రభుత్వం వెంటనే విద్య హక్కు చట్టం 2009, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద విచారణ జరిపి కేసులు బనాయించాలి.. విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.