సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
–జిల్లా అధ్యక్షుడు కాట కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెంవీరేందర్ రెడ్డి
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం చెన్నారావుపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశము జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడు కాట కుమారస్వామి ప్రధాన కార్యదర్శి మన్నెం వీరేందర్ రెడ్డి సమీక్షంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కోసం నూతన మండలాల ఎన్నికల విషయం మరియు హైకోర్టు సుప్రీంకోర్టు సమాచార పరిరక్షణ కమిటీ వేసిన లేఖలు అనుకూలంగా వచ్చిన లేఖల విషయం గురించి కిందిస్థాయి అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ తప్పుడు ద్రువ పత్రాలను సమాచారం అందిస్తున్న వారిపై ఆయా సెక్షన్ నెంబర్లను అనుసరించి వారిపై పోలీస్ కంప్లైంట్ పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నమెంటు వెంటనే స్పందించి సమాచార హక్కు చట్టం కమిషన్ నియమించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఇన్చార్జ్ పూర్ణ కుమార్, వరంగల్ యూత్ కన్వీనర్ సాదా బోయిన రాజు, న్యాయవాది మహమ్మద్ రహీముద్దీన్, వరంగల్ ఉపాధ్యక్షులు మల్లాడి వీర రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జ్ కుస సుదర్శన్, వర్ధన్నపేట ఇంచార్జ్ నాగరాజు, నర్సంపేట ఇంచార్జ్ జాటో యాకుబ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు చెలుకల పెళ్లి రాజు ప్రధాన కార్యదర్శి గూగులోత్ అమ్రు నాయక్,దుగ్గొండి మండల అధ్యక్షుడు గూడెపు అమరేందర్ మండల ఉపాధ్యక్షుడు మనుబోతుల శివకుమార్ నర్సంపేట మీడియా ఇంచార్జ్ మాదారపు శ్రీనివాస్ నర్సంపేట మండల అధ్యక్షుడు కట్ల మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నూనె అశోక్ , ఉపాధ్యక్షుడు పుట్ట సురేష్ నెక్కొండ మండల అధ్యక్షుడు జాటోత్ అనిల్ నాయక్ ప్రధాన కార్యదర్శి బానోతు రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.