*సమాచార హక్కు చట్టం రామబాణం అవగాహన సదస్సు గటాడి ఆనంద్ న్యాయవాది*
ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి
ఆర్మూర్ పట్టణంలోని విద్యా హైస్కూల్లో న్యాయవాది గటాడి ఆనంద్ విద్యార్థి విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని తెలిపారు గ్రామపంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు పార్లమెంట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు కావాల్సిన సమాచారాన్ని ఎలా రాబట్టుకోవాలో వివరించారు సమాచార హక్కు చట్టం ద్వారా సాధించిన విజయాలను క్రుప్తంగా వివరించారు అవినీతిని అంతం చేసేందుకు ఈ చట్టం ఎంతో దోహదపడుతుంది అన్నారు ఈ చట్టం రామబాణం లాంటిదని తెలిపారు దరఖాసుదారునికి కోరిన సమాచారం ఏ ప్రభుత్వ అధికారైన తప్పుడు, అసంపూర్తి సమాచారం ఇచ్చిన, సమాచారం తప్పుదోవ పడిన అధికారికి రాష్ట్ర కమిషన్ 250 నుంచి 25 వేల వరకు జరిమానా విధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ పోవార్ ప్రవీణ్, ఉపాధ్యాయులు పట్వారి తులసి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.