ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ ద్వారా నిర్మించ తలపెట్టిన సంగారెడ్డి కెనాల్ నిర్మాణానికి తమ భూములు ఇవ్వమంటూ రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈరోజు దీక్ష శిబిరంలో చెన్నాపూర్, బ్రాహ్మణపల్లి, చిన్నచింతకుంట, చెందిన రైతులు నరసింహారెడ్డి, నార్ల అంజాగౌడ్, రామకృష్ణ, రాజమౌళి, పాల్గొన్నారు.