గ్రామాల్లో ప్రభుత్వ వైద్యుల కంటే ఆర్ఎంపీ ల పెత్తనం..!

గ్రామాల్లో ప్రభుత్వ వైద్యుల కంటే ఆర్ఎంపీ ల పెత్తనం..!

ఆశావర్కర్ల మాట వినిపించనివ్వని ఆర్ఎంపీ

“పీవర్ టెస్ట్ అవసరం లేదు” అని కుటుంబాన్ని తప్పుదారి పట్టించాడు

డెంగ్యూ తీవ్రతరం అయ్యేంత వరకు వాయిదా!

మహేష్(33) ప్రాణం బలైంది

ఆర్ఎంపీ సెంటర్‌ సీజ్ చేసిన అధికారులు – చట్టపరమైన చర్యలు తప్పవన్న డీఎంహెచ్వో

ప్రశ్న ఆయుధం ఆగష్టు 24

సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ నిర్లక్ష్యం యువకుడి ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన కొంతం మహేష్(33) డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఆశా వర్కర్లు జ్వర పరీక్ష కోసం మహేష్ ఇంటికి వెళ్ళగా, ఆర్ఎంపీ “జ్వరం ఏమీ లేదు” అని కుటుంబాన్ని నమ్మబలికాడు. ఫలితంగా ప్రభుత్వ వైద్యుల దగ్గర పరీక్షలు జరగలేదు.జ్వర నిర్ధారణ లేకుండానే ఆర్ఎంపీ మందులు, సూదులు వేసినట్టు డీఎంహెచ్వో ధన్ రాజ్ తెలిపారు. చివరకు వ్యాధి తీవ్రతరం కావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.ఈ ఘటనపై స్పందించిన డీఎంహెచ్వో, ప్రజలను తప్పుదారి పట్టించిన ఆర్ఎంపీ సెంటర్‌ను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment