షాద్ నగర్ ఎలికట్ట చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.
ఆగి ఉన్న కంటెర్నను ఢీ కొట్టిన బైక్…
అక్కడికక్కడే మృతి చెందిన వాహనదారుడు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఎలికట్ట చౌరస్తా వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం ఆగి ఉన్న కంటైనర్ ను బైక్ ఢీ కొట్టినట్టగా కంటైనర్ డ్రైవర్ పరారిఅయినట్టు తెలిపారు. ఆక్సిడెంట్ అయిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా బైక్ పై ఉన్న మహిళకు కాలు విరిగినట్టుగా సమాచారం అక్కడ వున్న కొందరు వ్యక్తులు 100 కు డయల్ చేయగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కుమ్మరి మహేష్ తండ్రి కుమ్మరి రాములు మిఠాలాపూర్ చౌడాపూర్ కుల్కచర్ల వికారాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్ సుశిల కానిస్టేబుల్లు భూపాల్ రెడ్డి, జమీర్ లు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందో అని సమాచారం సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.