నిజామాబాద్ జిల్లా సెప్టెంబర్ 18 ( ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్: ఏడపల్లి మండలంలోని ఎమ్మెస్సి ఫారం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న గూడ్స్ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సిలిండర్లు ఉన్నప్పటికీ పేలుడు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.