*• కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గింపు.*
*• ప్రమాదాల తగ్గింపులో కామారెడ్డి జిల్లాకు రాష్ట్ర డిజిపి జితేందర్, ఐపిఎస్, ప్రశంస.*
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 14
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా గత ఏడాది కాలంతో పోల్చితే ఈ ఏడాది మొదటి 7 నెలల కాలంలో, 41 రోడ్డు ప్రమాదాలు మరియు 44 మరణాల తగ్గుదల నమోదైంది. ఇది జిల్లాలో రహదారి భద్రతలో శుభసూచకమైన పురోగతి అని చెప్పవచ్చు.
Road Accidents information for the year 2024 & 2025 (Upto July-31st)
Fatal Cases Deaths Injured
2024 2025 2024 2025 2024 2025
170 129 179 135 315 272
జిల్లా పోలీసులు రహదారి భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యముగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, అతివేగంగా ప్రయాణం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఈ క్రమంలో పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలనే అవగాహన కల్పిస్తూ వారి ప్రాణాలను కాపాడడం తమ ప్రధాన లక్ష్యమని ఎస్పీ, తెలిపారు.
రాష్ట్ర డిజిపి, అభినందనలు
కామారెడ్డి జిల్లా రహదారి భద్రతా చర్యల వల్ల సాధించిన ఈ విశేష ఫలితాలను రాష్ట్ర పోలీసు ప్రధాన అధికారి (డిజిపి), అభినందించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో జిల్లా ఎస్పీ వారి అధికారులు మరియు సిబ్బంది అంకితభావం మరియు సమర్థవంతమైన చర్యలు ఆదర్శనీయమైనవని అని తెలిపారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల తగ్గింపు – ఎస్‌పి గారి విజ్ఞప్తి.
జిల్లాలో రోడ్డు భద్రతా ప్రమాణాలను కాపాడేందుకు జిల్లా పోలీసులు నిరంతర క్రుషి చేస్తున్నారని డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహన ప్రయాణం, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, అతివేగం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు, బ్లాక్‌స్పాట్స్ గుర్తింపు, ప్రమాద ప్రాంతాల్లో ట్రాఫిక్ బోర్డులు, హెచ్చరిక సూచనలు, అవగాహన కార్యక్రమాలు మరియు నిరంతర పర్యవేక్షణ ఫలితంగా జిల్లాలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని జిల్లా ఎస్‌పి గారు తెలిపారు. “గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 44 మరణాలను తగ్గించగలిగాము ” గత ఏడాది జూలై లో 19 రోడ్డు ప్రమాద మరణాలు కాగా ఈ ఏడాది 8 మరణాలు మాత్రమే జరిగినవి అని చెప్పారు.
కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ఆకస్మిక వాహనాల తనిఖీ ద్వారా ఈ నెలలోఇప్పటివరకు
• (19) మంది అనుమానస్పద కదలికలు చేస్తున్న వ్యక్తులను పట్టుకోగ వీరు పాత నేరస్తులుగా గుర్తించి వారి వద్దనుండి (4) బైక్ లు మరియు గంజాయి, ఒక వ్యక్తి వద్ద నుండి కట్టర్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
• (631) మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులను పట్టుకొని కేసులు చేయగా ఇందులో (9) మందికి 2 రోజుల జైలు శిక్ష రూ. 200/- జరిమానా ఇప్పటికే కోర్ట్ ద్వారా విధించడం జరిగింది.
• తప్పుడు లేదా సరియగు వాహన నంబర్ లేకుండా ఉన్న (1740 ) వాహనాలను గుర్తించడం జరుగగా అందులో కొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది.
• పోలీసు శాఖ ద్వారా రోడ్డు ప్రమాదలను తగ్గించి మానవ ప్రాణాలను కాపాడాలని నిరంతర క్రుషి చేస్తున్నా ప్రజలలో మార్పు రావడం లేదు. ఇంకా రోడ్డు భద్రతా నియమాణాలను పాటించకుండా రోడ్డు ప్రమాదలలో మరణిస్తున్నారు.
• ఇకనైనా “ప్రజలు రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తారని తద్వారా రోడ్డు ప్రమాదలను తగ్గించాలని దీనికీ జిల్లా ప్రజలందరు సహకరించాలని తెలిపారు.
“రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత – ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం- విలువైన ప్రాణాలను కాపాడుకుందాం