*రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గింపు.*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 01
జిల్లాలో రోడ్డుప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు ఫలితంగా ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత సంవత్సరం 6 నెలల కాలముతో పోల్చితే గణనీయంగా తగ్గింది.
2024లో 317 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2025 లో 282 కి తగ్గించగలిగాము. ముఖ్యముగా మరణాల కేసులు 152 నుండి 120కి అనగా 21% తగ్గుదల, మరణించిన వారి సంఖ్య 160 నుండి 125కి అనగా 22% తగ్గుదల ఉన్నది. ఇది చాలా శుభసూచకముగా చెప్పవచ్చు.
ఈ గణాంకాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించి వెలకట్టలేని విలువైన ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశముతో ప్రతీరోజు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ మరియు లైసెన్స్ లేని వారిని, అతివేగంగా ప్రయానించు వారిని గుర్తించి చాలానాలు వేయడం వల్ల సాధ్యమయ్యాయని జిల్లా ఎస్పీ తెలిపారు.
6 నెలల కాలములోనే 75,179 లైసెన్స్ లేనివారు, అతివేగంగా-43,348, విత్ అవుట్ హెల్మెట్-16,340 డ్రంక్ అండ్ డ్రైవ్-5942 చలానాలు వేయడం జరిగింది. అదేవిధముగా 28 బ్లాక్ స్పాట్స్ గుర్తించి సంబంధిత రోడ్లు, శాఖల వారితో మాట్లాడి నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ips తెలిపారు.
*తగ్గిన దొంగతనం కేసులు*
దొంగతనం కేసులు గత సంవత్సరo 259 కాగా ఈ సంవత్సరoలో 214 అయ్యి 17 % తగ్గించగలిగాము. ఇందులో ప్రజలందరికీ తగు జాగ్రత్తలు తెలియజేయడము మరియు ప్రజలతో మమేకమై గస్తీ దళాలు ఏర్పాటు చేయడం వలన సాద్యమయ్యింది.
తగ్గిన మహిళలపై వరకటనపు వేదింపు కేసులు: గత సంవత్సరo 174 కేసులు కాగా ఈ సంవత్సరoలో 167 తగ్గినవి.
*జైలు శిక్షలు*
ఈ సంవత్సరo ఇప్పటివరకు నిందుతులకు (06) కేసులలో జీవితఖైదీ శిక్షలు (12) కేసులలో 7 సం,, లోపు శిక్షలు పడినవి. ఇలా నేరాలుచేసిన వారి పై కఠినమైన చర్యలు తీసుకోవాడమే కాకుండా కచ్చితముగా శిక్షలుపడే విదముగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా వాడుకోవడములో జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
*అంతరాష్ట్ర పార్థి గ్యాంగ్ పట్టివేత*
(11) మంది సభ్యులు ఒక ముఠా గా ఏర్పడి (పార్థి గ్యాంగ్) రాత్రి సమయాల్లో జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహన దారులను లక్ష్యం గా చేసుకొని వాహనాల అద్దాలను పగులగొట్టి, వాహనదారులపై దాడి చేసి వారిని గాయపరిచి, బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు, విలువైన వస్తువులను మొబైల్ ఫోన్ లను దొంగిలిస్తున్నారు. వీరిని అందరని మన జిల్లా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది.
*ఫోన్స్ రికవరీ*
CIER అప్లికేషన్ ద్వారా ఇప్పటివరకు పోగొట్టుకున్నవారి (3265) మోబైల్ ఫోన్స్ సుమారు రూ. 7 కోట్ల విలువ గల వాటిని రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. గత 6 నెలల కాలములోనే 452 రికవరీ చేయడం జరిగింది. రాష్ట్ర స్తాయిలో కమీషనరేట్స్ లో కాకుండా జిల్లాల పనితీరులో మన జిల్లా ప్రథమ స్థానంలో కలదు.
*కారుణ్య నియామకాలు.*
గాంధారి పోలీస్ స్టేషన్ పరిదిలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటనలో విధి నిర్వహణలో వడ్ల రవి, (కానిస్టేబుల్) అసువులుబాయగా అతని భార్య అయిన సౌఖ్య, అదేవిధముగా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, అనారోగ్యంతో చనిపోగా కుమార్తె మానస లకు కారుణ్య నియామకాలలో భాగంగా 2 నెలల లోపే కాలములోనే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఉత్తర్వులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ అందజేయడం జరిగింది.
పారదర్శక బదిలీలు.
హోంగార్డు నుండి ఏఎస్ఐ స్థాయి వరకు 192 మంది సిబ్బందికి కౌన్సిలింగ్ చేసి స్పౌస్, సీనియారిటీ, హెల్త్ గ్రౌండ్స్ పరిగణలోకి తీసుకొని బదిలీల ప్రక్రియ పారదర్శముగా పూర్తిచేయడం జరిగింది.
*కొత్త లోగో ఆవిష్కరణ.*
“Fearless Always. Vigilant Forever అనే నినాదముతో కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ లోగోను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS ఆవిష్కరించడం జరిగింది అంటే కాకుండా లోగో అనుగుణముగా ప్రజలకు సేవలు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు.
DIAL-100. ఈ 6 నెలల కాలములో మొత్తం DIAL-100 కాల్స్ 22102 రాగా, వీటిలో 137 కేసులు నమోదు చేయగా మిగితావి సామరస్యముగా మరియు వివిద విధాలుగా పరిష్కారించడం జరిగినది. అదేవిధముగా DIAL-100 నుండి సమాచారం అందిన వెంటనే అతి తక్కువ సమయములోనే బాధితుల వద్దకు బ్ల్యూకోల్ట్, పెట్రోలింగ్ సిబ్బంది చేరుకునేల ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుంది.
*2025- సంవత్సరము*
రానున్న 6 నెలల కాలములో నేరాలు తగ్గే విధముగా మరియు ప్రజలందరికీ పూర్తి శాంతి భద్రతలతో కూడిన సమాజాన్ని అంధించే విధముగా అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటాము. ముందస్తు జాగ్రత్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటికే వర్షాలు వరదల దృష్ట్యా జరుగు ప్రమాదాల ముదస్తూ జాగ్రత్తలను ప్రజలందరికీ గుర్తుచేయడం జరిగింది.