బూర్గంపహాడ్ వద్ద ప్రధాన రహదారిపైకి చేరిన గోదావరి వరద.రెడ్డిపాలెం బూర్గంపాడు కి మధ్య రాకపోకలు బంద్.బూర్గంపహాడ్ పెట్రోల్ బంక్ వద్ద ప్రధాన రహదారి పైకి వచ్చి చేరిన వరద నీరు, దీంతో రెడ్డిపాలెం బూర్గంపహాడ్ మధ్య రాకపోకలు నిలిపివేసిన అధికారులు. భద్రాచలం వద్ద ఉదయం 9 గంటలకు భద్రాచలం వద్ద 51.4 అడుగుల వద్ద గోదారి నీటి మట్టం పెరుగుతూ ప్రవహిస్తున్న గోదావరి. మూడవ ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులకు గోదావరి నీటి మట్టం నేటి సాయంత్రానికి చేరుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే 3 కుటుంబాల ప్రజలను పునరావాసం బాట పట్టించారు.