రోడ్డు భద్రత మనందరి బాధ్యత. హెల్మెట్ ధరించు ప్రాణాలు కాపాడుకో

ప్రశ్న ఆయుధం జనవరి 25 సుజత నగర్ మండల ప్రతినిధి

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సుజాతనగర్ SI రమాదేవి సిబ్బంది తో కలిసి ధన్వంతరి కాలేజ్ ఫార్మసీ స్టూడెంట్స్ తో వినూత్నంగా ధన్వంతరి కాలేజ్ నుంచి సుజాతనగర్ సెంటర్ వరకు రూట్ మార్చ్ నిర్వహిస్తూ వాహనదారులకు యువకులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు.ప్రతివాహనదారుడునిబంధనలను పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని త్రిబుల్ రైడింగ్ చేయవద్దని మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనo కు సంబంధించిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించడoజరిగింది.సుజాతనగర్ సెంటర్లో స్టూడెంట్స్ తో కలిసి మానవహారం నిర్వహించి ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరిగింది.కావున రోడ్డుమీద నడిచేవారు మరియు వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరనైనది.M. రమాదేవి
SI సుజాతనగర్.

Join WhatsApp

Join Now