వివిధ జిల్లా శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం                                                                                                        

భద్రత
Headlines:
  1. రోడ్డు భద్రత కమిటీ సమావేశం: మత్తు పదార్థాల వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై చర్చ
  2. సిద్ధిపేటలో రోడ్డు భద్రతపై కీలక సమావేశం: నిషేధ చర్యలు, అవగాహన సదస్సులు
  3. అబ్దుల్ హమీద్ రహదారుల భద్రత, డ్రగ్స్ వినియోగంపై ఆదేశాలు ఇచ్చారు
  4. మత్తు పదార్థాల వినియోగం నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు
  5. ఆర్టీసీ, పోలింస్ సిబ్బంది సమన్వయంతో రోడ్డు రద్దీ, డ్రంక్ డ్రైవింగ్ పై చర్యలు

*రోడ్డు ప్రయాణాలు, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగ నిషేధం*

* అన్ని శాఖలు సమన్వయంతో అవగాహన సదస్సులను నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) అబ్దుల్ హమీద్

శనివారం (ఐడిఓసి) కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగంపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

 ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రహదారుల వెంట స్పీడ్ బ్రేకర్లు, చెట్ల పొదలు లేకుండా తొలగించాలని, ఇంకా తొలగించవలసినవి ఉన్నట్లు గుర్తించినట్లయితే వారంలోగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు మైనర్ డ్రైవింగ్ లపై అధికారులు కఠినంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. రోడ్డు, రద్దీ ప్రాంతాల్లో బస్సులు, ఇతర వాహనాలను ఆపడం లేదా పార్కింగ్ చేయడం వంటివి జరగకుండా ఆర్టీసీ, పోలింస్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో నిర్వహించే బెల్ట్ షాపుల పై చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థలలో డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వినియోగంపై అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. జిల్లాలో బయటి ప్రాంతాల నుండి మత్తుపదార్థాల తరలింపు జరగకుండా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డీఈఈ బి.మనోహర్, సిద్దిపేట ఎసిపి మధు, సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, జిల్లా వైద్యాధికారి డా పల్వన్ కుమార్, ఎన్.హెచ్. డీఈఈ డి. అన్నయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, ఇతర పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now