ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 5 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఎస్ఐ మధుకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది ఆధ్వర్యంలో శివ్వంపేట బస్టాండ్లో ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నియమాలు పాటించాలని, నిబంధనలను అతిక్రమించకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు