Site icon PRASHNA AYUDHAM

పెద్ద పోతంగచౌరస్తానుండి మేడిపల్లితండావరకు రోడ్డుపనులు ప్రారంభం

IMG 20241228 WA0063

*పెద్ద పోతంగచౌరస్తానుండి మేడిపల్లితండావరకు నూతన రోడ్డుపనులు*

ప్రశ్న ఆయుధం గాంధారి 28:

ఎమ్మెల్యేమదన్ మోహన్ శరవేగంగాపూర్తిచేయాలని ఆదేశించారు*

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దపతంగల్ చౌరస్తా నుండి మేడిపల్లి తండా వరకు బిటి రోడ్డు పనులు శరవేగంగా ముస్తాబవుతున్న రోడ్లు

14 కోట్ల రూపాయలతో మంజూరైన తారు రోడ్డు పనులు కాంట్రాక్టర్ రోడ్డుపై కంకర వేసి చేతులు ఎత్తివేశారు . రెండేళ్ల నుంచి జిల్లా కేంద్రమైన కామారెడ్డి కి వెళ్లడానికి మేడిపల్లి తునుంచి పొతంగల్ కలన్ కంకర రోడ్డుపై ప్రయాణించడం ఒక నరకంగా మారింది.చివరికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈ రోడ్డు బాగు కోసం కృషి చేయడం వల్ల, ప్రస్తుతం శనివారం నుంచి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం పెద్ద పోతంగల్ నుంచి మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు గుంతలమయం , కంకర తేలి ప్రయాణికులు నరకయాతన పడుతున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే రోడ్డు బాగు కోసంనడుంబిగించారు.

ఎమ్మెల్యే మదన్ మోహన్  స్పందించి అధికారులతో మాట్లాడగా కాంట్రాక్టర్ సమస్య వల్ల రోడ్ నిర్మాణ పనులు మధ్యలోనే అడిగిపోవడం జరిగింది తెలుసుకొని మదన్ మోహన్ పెండింగ్ బిల్లుల సమస్య పై కాంట్రాక్టర్ తో మాట్లాడి 14 కోట్ల విలువ అయిన బుగ్గ గండి రోడ్డు,  బిటి రోడ్డు పనులు కొరకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. శనివారం నుంచి ఈ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఎమ్మెల్యే కృషిని అభినందిస్తున్నారు.

Exit mobile version