జగన్ కు రోజా గుడ్ బై…?

జగన్ కు రోజా గుడ్ బై…?

IMG 20240826 WA0035

వైసీపీ కి జగన్ కి ఆర్కే రోజా గుడ్ బై చెప్పెయ్యబోతుందా.. అంటే అవుననే మాటే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకే రోజా ఆంధ్ర పాలిటిక్స్ పై ఎలాంటి కామెంట్స్ చెయ్యడం లేదు అని కూడా అంటున్నారు. ఇప్పటికే రోజా ఏపీ పాలిటిక్స్ ని వదిలి తమిళ రాజకీయాలవైపు వెళ్లబోతుంది అనే టాక్ నడుస్తుంది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన రోజా ని నగరి వైసీపీ కార్యకర్తలే నిట్ట నిలువునా ముంచేశారు. రోజా ఇప్పుడు ఏపీలో ఏం మాట్లాడినా ఆమె అరెస్ట్ ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర, తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో రోజా కి కూటమి ప్రభుత్వం చుక్కలు చూపించేందుకు సిద్దమవుతుంది. అందుకే రోజా ఏపీ రాజకీయాల విషయంలో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయినట్లుగా అనిపిస్తుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి రోజా మాట్లాడాలనుకుంటే ఏపీలో చాలా విషయాలున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా ముందు ప్రతిపక్షాలను ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి అధికారం పోగానే పిల్లిలా మారిపోయిన రోజా జగన్ కి గుడ్ బై చెప్పే ఏర్పాట్లలో ఉందట. ఇప్పటికే తమిళనాట హీరో విజయ్ పార్టీలో చేరేందుకు రోజా చూస్తుందని, కానీ విజయ్ మాత్రం అవినీతి మరకలున్న వారిని పార్టీలో చేర్చుకోబోమనే విజయ్ సంకేతాలు పంపిస్తున్నారట. ఆ విషయంలోనే రోజా కి ఎటు పాలుపోక చెన్నై టు నగరి అంటూ చక్కర్లుకొడుతుంది అంటున్నారు. చూద్దాం రోజా రాజకీయ పయనం ఎటో అనేది.!

Join WhatsApp

Join Now