పోలీస్ అమరవీరులు పోషించిన పాత్ర

పాత్ర

పోలీస్ అమరవీరులు పోషించిన పాత్ర తరతరాలకు తరగని చరిత్ర అనే కవిత సంకలనం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర

కరీంనగర్ అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రజాకవి రచయిత సామాజికవేత్త మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ నాగుల సత్యం గౌడ్ రచించిన పోలీస్ అమరవీరులు పోషించిన పాత్ర తరతరాలకు తరగని చరిత్ర అనే కవిత సంకలనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రోజున తన కార్యాలయంలో ఆవిష్కరించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల పురస్కరించుకొని రూపొందించిన కవితా సంకలనం అని సత్యం గౌడ్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, ఇందుకు ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలో మెదిలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు పోలీసులు సమాజానికి రక్షణ కవచం లాంటివారని అందుకే ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహించి, ప్రజలతో మమేకమయి, ప్రజల రక్షణ కొరకు అహర్నిశలు శ్రమిస్తు, శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల పాత్ర సమాజంలో అతి కీలకమైందని శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు సహకరిస్తూ నిజాయితీగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సేవా భవాన్ని లవర్చుకొని సమాజసేవలో భాగస్వాములై, నవభారత నిర్మాణానికి పునాదిగా నిలవాలని సత్యం గౌడ్ పిలుపునిచ్చారు. మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ విలువైన పౌరులుగా ఎదిగినప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుందని ప్రతి ఒక్కరూ అంటరాని స్వార్ధాన్ని వదులుకున్నప్పుడే మహాత్ములు, మహనీయులు అవుతారని అన్నారు. అనంతరం ఆవిష్కరించిన పోలీస్ అమరవీరుల కవిత సంకలనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి సత్యం గౌడ్ ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో వోడ్నల రాములు, మార్క్ అనిల్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now