సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి పురస్కరించుకొని ఇంద్రేశం మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రోశయ్య చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పూలమాల వేసి, నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రేశం మున్సిపాలిటీలో ఘనంగా రోశయ్య వర్ధంతి
Oplus_16908288