*రోడ్డు అభివృద్ధికి కృషిచేసిన కాంగ్రెస్ నేతలకు రాయల్ ఫోర్ట్ హోమ్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు**
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జులై 1

నాగారం మున్సిపల్ పరిధిలోని రిక్వెల్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ రోడ్డును అభివృద్ధి చేసే అంశంలో చొరవ చూపిన కాంగ్రెస్ నాయకులు వజ్రేష్ యాదవ్ మరియు ముప్పు శ్రీనివాస్ రెడ్డిలకు రాయల్ ఫోర్ట్ హోమ్స్ అసోసియేషన్ తరపున కాలనీవాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సుమారు నాలుగు నెలల క్రితం కాలనీవాసులు సమస్యను కోరిన వెంటనే తక్షణ చర్యలు తీసుకొని పలు పనులు ప్రారంభించి పూర్తి చేసిన నాయకుల తీరుపై వారు హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఈ సమస్యపై ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎమ్మెల్యే మల్లా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి సహా పలువురు నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇటీవల కాలనీలోని డ్రైనేజీ, రోడ్డు వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ నాయకుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డిని కాలనీవాసులు కలిసి, సమస్యల పరిష్కారానికి ఆయన ఇచ్చిన మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు. రిక్వెల్‌ఫోర్డ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న శ్రీనివాస నగర్, శ్రీ సాయి కాలనీ, పిసిఆర్ ఎన్‌క్లేవ్, పిఎంఆర్ ఎన్‌క్లేవ్, జై భవానీ ఎన్‌క్లేవ్, చంద్ర ఎన్‌క్లేవ్ వంటి కాలనీలలో ఇప్పటికే కొంత మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు.మిగిలిన ప్రాంతాల్లో పనులు త్వరలో ప్రారంభమవుతాయని ముప్పు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. కాలనీల అభివృద్ధికి అచంచలంగా ముందుండి నడిచిన ముప్పు శ్రీనివాస్ రెడ్డి, వజ్రేష్ యాదవ్‌లకు రాయల్ ఫోర్ట్ హోమ్స్ అసోసియేషన్ సభ్యులు, కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 0