జీవో నెంబర్ 60 ప్రకారం ఆర్పీలకు వేతనాలు అమలు చేయాలి
బకాయి పడిన ఆరు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి
ఆర్పీల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సుభద్ర
గజ్వేల్ డిసెంబర్ 18 ప్రశ్న ఆయుధం :
ఆర్పిలందరికీ జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని,బకాయి పడిన జీతాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ మెక్మ ఆర్పీల సంఘం సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి పి సుభద్ర డిమాండ్ చేశారు తెలంగాణ మెక్మా ఆర్పి ల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రూపులు ఏర్పాటు చేసి పొదుపు డబ్బులు జమ చేపిస్తూ, కొత్త రుణాలను, శ్రీనిధి అనేక రూపాలలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు రుణాలను మంజూరు చేయించడం జరుగుతుంది, తిరిగి డబ్బులను బ్యాంకులో నమోదు చేసే విధంగాసభ్యులను అవగాహన కల్పించడం జరుగుతుంది, ప్రభుత్వం యొక్క అనేక రూపాల పనులను పథకాలను ప్రజల వద్దకు చేరడం జరుగుతుంది కానీ ఆర్పీలకు వేతనాలు ఇవ్వకుండా పెంచకుండా వేధింపులకు మానసికపరమైన ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందని అన్నారు. పట్టణంలో నివాసం వలన ప్రతిరోజు ఖర్చులు,అవసరాలు పెరుగుతున్నాయని జీతాలు లేకుండా ఇలా బతకడం అని ప్రశ్నించారు ప్రభుత్వ వెంటనే జోక్యం చేసుకోని సమస్యలు పరిష్కరించాలని, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, ఆర్పీల సంఘం నాయకులు కల్పనా , పద్మ ,ఫాతిమా, మనోహరి, లావణ్య సుధారాణి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.