రూ. 1.60 లక్షల గోవా మద్యం పట్టివేత..

రూ. 1.60 లక్షల గోవా మద్యం పట్టివేత..

• కారు సీస్, నలుగురు వ్యక్తుల అరెస్ట్

నూతన సంవత్సర వేడుకల కోసం కొంతమంది అక్రమార్కులు గోవాకు వెళ్లి కారులో 64 మద్యం బాటిలను తరలిస్తున్న క్రమంలో జహీరాబాద్ డిటిఎఫ్ టీం ఇతర ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

పట్టుకున్న మద్యం విలువ రూ. 1.60 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మద్యంతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

మరోచోట 34 బాటిల్ తీసుకొని వస్తున్న వ్యక్తి ఎక్సైజ్ పోలీసులను చూసి పార్టీలను అక్కడ పడేసి వదిలి వెళ్లాడు. ఈ బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నామని డిటిఎఫ్ సీఐ దుబ్బాక శంకర్ తెలిపారు.

మొత్తంగా 14 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీఐ దుబ్బాక శంకర్ తో పాటు హనుమంత్ అనుదీప్ ఇతర సిబ్బంది కేసులు నమోదు చేశారు.

ఈ మొత్తం బాటిళ్లను, నిందితులను ఎక్సైజ్ జహీరాబాద్ సిఐ శ్రీనివాస్ రెడ్డికి స్వాధీనం స్వాధీన పరిచినట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో సిరిసిల్ల జగిత్యాల కోరుట్ల ప్రాంతాలకు చెందినటువంటి కృష్ణ, రామ్, మారుతి అజయ్. లు నిందితులుగా ఉన్నారు.

మద్యం బాటిల్ పట్టుకున్నటువంటి ఎక్సైజ్ టీం లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విబి కమలహాసన్ రెడ్డి, మెదక్ డిసి హరికిషన్ ఏసీజీ శ్రీనివాసరెడ్డి ఎస్ నవీన్ చంద్ర లు అభినందించారు.

Join WhatsApp

Join Now