మెరుగైన వైద్యం కోసం రూ.1,30,000 చెక్కు అందజేత

మెరుగైన వైద్యం కోసం రూ.1,30,000 చెక్కు అందజేత

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం ఆగస్టు 2

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసర గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన రూ.1,30,000 చెక్కును శనివారం అందజేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తన చేతుల మీదుగా ఈ చెక్కును లక్ష్మారెడ్డికి అందించారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కీసర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ల కృష్ణ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామిడి విజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు మచ్చాని జంగయ్య యాదవ్, నాగారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, తటాకం అభిలాష్, చర్లపల్లి కృష్ణారెడ్డి, కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు పోచబోయిన రాజు యాదవ్, ప్రవీణ్ ముదిరాజ్, కందడి సత్తిరెడ్డి, మచ్చాని శ్రీశైలం యాదవ్, ముద్దం మల్లేష్ యాదవ్, దయానంద్ గౌడ్, కుమ్మరి కృష్ణ, పోచబోయిన శ్రీశైలం యాదవ్, మెట్టు అంజయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment