దళిత నేత అంటే కోపగించుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ !

దళిత నేత అంటే కోపగించుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ !

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ మరోసారి ఏబీఎన్ చానల్‌ను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఏదైనా అలవాటు మానేయడం.. లేదా బహిష్కరించడం ఒక్క సారే చేస్తారు.. మళ్లీ మళ్లీ చేస్తే దానికి విలువ ఉండదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ .. గతంలోనూ బహిష్కరించి..ఇప్పుడు కూడా బహిష్కరించారు. మళ్లీ కోపం వస్తే మరోసారి బహిష్కరిస్తారు .. అందులో విశేషం ఏమీ ఉండదు. కానీ అసలు ఎందుకు కోపం వచ్చిందో ఆయన చెప్పిన కారణం చూస్తే.. ఇలా కూడా అనిపిస్తుందా అని ఆశ్చర్యం కలగడం నిజమే.

అసలు ఎందుకు కోపం వచ్చిందంటే.. దళిత నేత ఆర్ఎస్ ప్రవీణ్ తో కేసీఆర్ ఆరోపణలు చేయిస్తున్నారా.. ఆయనును పావుగా వాడుకుంటున్నారా అని ఓ డిబేట్ లో ప్రోమోలో వాక్యం వాడారు. ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కు ఎక్కువగా మీడియా ముందుకు వచ్చే చాన్స్ ఇస్తున్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడుతున్నారు. అదే అంశాన్ని వెంకటకృష్ణ తన టాపిక్ లో చెప్పారు. అయితే దళిత నేత అని ట్యాగ్ పెట్టినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కు కోపం వచ్చింది. ఏబీఎన్ ఆర్కేకు, వెంకటకృష్ణకు కులపిచ్చి అని మండిపడ్డారు.

నిజానికి దళిత నేత ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పడం అంటే ఆయనకు గౌరవం ఇచ్చినట్లే. ఎందుకంటే ఆ వర్గం కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్నారు. చాలా సార్లు చెప్పారు కూడా. బీఎస్పీలో చేరికకూ కారణం అదే. స్వేరో అనేసంస్థను దళిత బిడ్డల కోసం నడుపుతున్నారు. అలాగే దళిత అంశాలపై విస్తృతంగా స్పందిస్తూంటారు. తన స్నేహితుడు..ఏపీకి చెందిన మరో ఐపీఎల్ సునీల్ కుమార్ కు కష్టం వచ్చినప్పుడు దళితకార్డును సోషల్ మీడియా బలంగా ప్రయోగిస్తూ ఉంటారు. అయినా తనను దళిత నేత అన్నందుకు ఆయన ఫీల్ అవడం కాస్త విచిత్రమే. ఆయన ఉద్దేశంలో.. దళితుడ్ని అయినందుకే కేసీఆర్ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని…కావొచ్చు..కానీ అలా అన్నారని వ్యతిరేకించడం మాత్రం .. వేరే అర్థాలకు దారి తీస్తుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment