సమాజ, దేశహితం కోసమే ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా పనిచేస్తుంది

సమాజ, దేశహితం కోసమే ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా పనిచేస్తుంది

వ్యక్తి నిర్మాణం ద్వారా మెరుగైన సమాజం, దేశ నిర్మాణం జరగాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

మానకొండూర్ అక్టోబర్ 19 ప్రశ్న ఆయుధం

సమాజ దేశహితం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్లుగా పని చేస్తుందని , వ్యక్తి నిర్మాణం ద్వారా మెరుగైన సమాజం, దేశ నిర్మాణం జరగాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్యవాహ ఉచ్చిడి పద్మారెడ్డి తెలిపారు. . ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆదివారం రోజున ఆర్ ఎస్ ఎస్ మానకొండూర్ ఖండ ఆధ్వర్యంలో పథసంచలన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత,కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాల న్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సర్రఫ్. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ .(నీటిపారుదల శాఖ). తో పాటు మొగిలి సంపత్ జిల్లా సేవా ప్రముక్ మల్లికార్జున స్వామి, జిల్లా వ్యవస్థ ప్రముక్ గీకూరు శ్రీనివాస్ జిల్లా ప్రచార ప్రముక్ మానకొండూరు ఖండ స్వయంసేవకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now