బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు తీవ్రంగా స్పందించిన ఆరెస్సెస్!

హిందువులపై

*బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు తీవ్రంగా స్పందించిన ఆరెస్సెస్!*

 ప్రకటన విడుదల చేసిన ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే

– దాడులపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శ

– ఇస్కాన్ గురువును విడుదల చేయాలని డిమాండ్

నవంబర్ 30: బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలపై జరుగుతోన్న దాడుల మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ప్రకటనను విడుదల చేశారు. మైనార్టీలపై దాడుల అంశం మీద అక్కడి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆరెస్సెస్ విమర్శించింది. ఇటీవల అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులు, మహిళలు, ఇతర మైనార్టీలపై జరుగుతోన్న దాడుల మీద ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించింది. హిందువులపై దౌర్జన్యాన్ని ఆపాలని, అలాగే ఇస్కాన్ గురువును వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వన్ని డిమాండ్ చేసింది. పక్క దేశంలో మైనార్టీలపై జరుగుతోన్న దాడులను అరికట్టే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగించాలని కోరింది. ఈ దాడుల విషయంలో ప్రపంచ మద్దతు దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment